వావ్ : NBK 107 మూవీ పై ఇంట్రెస్టింగ్ న్యూస్

వావ్ : NBK 107 మూవీ పై ఇంట్రెస్టింగ్ న్యూస్

Published on Jun 30, 2022 2:30 AM IST

నందమూరి బాలకృష్ణ హీరోగా ఇటీవల బోయపాటి శ్రీను తీసిన అఖండ మూవీ ఎంతో పెద్ద సక్సెస్ కొట్టి హీరోగా బాలకృష్ణకి కెరీర్ పరంగా మంచి బ్రేక్ ని అందించింది. ఈ మూవీలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయగా, ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిరియాల రవీందర్ రెడ్డి ఈ మూవీని ఎంతో గ్రాండ్ గా నిర్మించారు. అఖండ అనంతరం ప్రస్తుతం బాలకృష్ణ, యువ దర్శకడు గోపీచంద్ మలినేనితో ఒక భారీ మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ లో యాక్ట్ చేస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ వారు దీనిని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ మూవీకి సంబంధించి ప్రస్తుతం ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. అదేమిటంటే, ఇందులో కూడా బాలకృష్ణ రెండు పాత్రల్లో కనిపించనుండగా ఫస్ట్ హాఫ్ లో రెండు లోకల్ ఫైట్స్, ఒక ఫారిన్ ఫైట్ తో పాటు ఇంటర్వెల్ బ్యాంగ్ సూపర్ గా అదిరిపోనుందట. అలానే సెకండ్ హాఫ్ లో అయితే మరింతగా ఆకట్టుకునే భారీ యాక్షన్, ఫైట్ సీన్స్ ఉన్నాయని తెలుస్తోంది. ఇటీవల క్రాక్ తో సూపర్ సక్సెస్ అందుకున్న గోపీచంద్, తన అభిమాన హీరో బాలకృష్ణతో తొలిసారిగా చేస్తున్న మూవీ కావడంతో దీనిని పక్కాగా బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టేలా ఎంతో అద్భుతంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు