విడుదల రోజే తమ సినిమాను ఉచితంగా చూడమంటున్న తెలుగు నిర్మాత !

విడుదల రోజే తమ సినిమాను ఉచితంగా చూడమంటున్న తెలుగు నిర్మాత !

Published on Jun 27, 2018 4:39 PM IST

ipc

రెట్టడి శ్రీనివాస్ దర్శకత్వంలో శరత్ చంద్ర హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ఐపిసి సెక్షన్ భార్యాబంధు’. శరత్ చంద్ర సరసన నేహా దేశ్ పాండే హీరోయిన్ గా నటిస్తోంది. ఒక్కప్పటి హీరోయిన్ ఆమని కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్రను పోషించారు. కాగా ఈ చిత్రం ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ చిత్ర నిర్మాతలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. సినిమా విడుదల రోజు ఉదయం ‘షో’ను అందరికీ ఉచితంగా ప్రదర్శిస్తున్నట్టు దర్శక నిర్మాతలు తెలిపారు.

దర్శకుడు రెట్టడి శ్రీనివాస్ మాట్లాడుతూ రెండు రాష్ట్రాల్లోని మల్టీ ప్లెక్స్ మినహా మిగిలిన అన్ని థియేటర్స్ (సింగిల్ స్క్రీన్స్)లో తొలి షోను ప్రేక్షకులు ఉచితంగా చూడొచ్చని దర్శకుడు ప్రకటించారు. మా చిత్రం చూసిన ప్రతి ఒక్కరూ బాగుందని పదిమందితో పంచుకుంటారనే నమ్మకంతోనే మా నిర్మాత ఆలూరి సాంబశివరావు ఈ నిర్ణయం తీసుకున్నారని దర్శకుడు రెట్టడి శ్రీనివాస్ చెప్పుకొచ్చారు.

తాజా వార్తలు