విక్రమ్ సినిమాలో నటించనున్న ఇండియన్ క్రికెటర్

Published on Oct 15, 2019 6:00 pm IST

ఇటీవలే ‘కదరమ్ కోండన్’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించాడు చియాన్ విక్రమ్. ఈ చిత్రం తెలుగులో ‘మిస్టర్ కె కె’గా విడులైంది. ప్రస్తుతం విక్రమ్ తన తర్వాతి సినిమాకు రెడీ అవుతున్నారు. ఈ చిత్రాన్ని అజయ్ ఙ్ఞానముత్తు డైరెక్ట్ చేయనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలైంది. ఇందులో ఇండియన్ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ నటించనున్నాడట.

ఈ విషయాన్ని స్వయంగా కన్ఫర్మ్ చేసిన ఇర్ఫాన్ తమిళ సినిమాను తాను తరచూ ఫాలో అవుతుంటానని, అవి హిందీలోకి కూడా డబ్ అవుతుంటాయని, విక్రమ్ చేసిన ‘అన్నియన్’ తన ఫేవరెట్ మూవీ అని చెప్పుకొచ్చాడు. సినీ జనమైతే పఠాన్ చేయబోయేది నెగెటివ్ రోల్ అని అంటుండగా చిత్ర యూనిట్ మాత్రం రివీల్ చేయట్లేదు.

ఇర్ఫాన్ గతంలో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడి ఉండటంతో తమిళ ప్రేక్షకుల నుండి ఆయనకు మంచి ఆదరణ దక్కే ఛాన్సుంది. వయకామ్, 7 స్క్రీన్ స్టుడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు. ఈ చిత్రం 2020కి ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం :

More