దేవి ‘ఎల్లమ్మ’లో సీనియర్ హీరో ?

దేవి ‘ఎల్లమ్మ’లో సీనియర్ హీరో ?

Published on Jan 19, 2026 10:00 AM IST

Yellamma

‘బలగం’ చిత్రంతో సాలిడ్ హిట్ అందుకున్నాడు వేణు యెల్డండి. ప్రస్తుతం తన తదుపరి చిత్రం ‘ఎల్లమ్మ’ (Yellamma) పై ఆయన వర్క్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ ను హీరోగా ఖరారు చేస్తూ ఫస్ట్ గ్లింప్స్‌ కూడా విడుదల చేశారు. దేవిశ్రీ ప్రసాద్‌ను ‘పర్శి’ అనే పాత్రలో పరిచయం చేశారు. గ్లింప్స్‌లోని విజువల్స్‌తో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. అయితే, ఈ సినిమాలో సీనియర్‌ హీరో రాజశేఖర్‌ కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. రాజశేఖర్ ది హీరో తండ్రి పాత్ర అని టాక్.

ఈ గ్రామీణ నేపథ్య ఎంటర్‌టైనర్ లో దేవిశ్రీ ప్రసాద్ హీరోగా ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి. అన్నట్టు ఇప్పటికే, దేవిశ్రీ ప్రసాద్ తన లుక్ తో ఆకట్టుకున్నాడు. పైగా ఈ సినిమాకు సంగీతం కూడా దేవి శ్రీ ప్రసాద్‌నే అందించనుండటం విశేషం. ఇక, ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటించబోతున్నారన్న విషయం ఇంకా వెల్లడించలేదు. దిల్ రాజుతో కలిసి శిరీష్ ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. కాగా, ఈ మూవీ ఆడియో హక్కులను టి-సిరీస్ సొంతం చేసుకుంది.

తాజా వార్తలు