మన టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఇప్పుడు దర్శకునిగా మారిన సంగతి తెలిసిందే. ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా తర్వాత తాను తన నెక్స్ట్ సినిమాకి హీరో గానే కాకుండా దర్శకునిగా కూడా భాద్యతలు తీసుకున్నాడు. దర్శకునిగా తన మొదటి సినిమా కూడా ఇదే కావడంతో ఫ్యాన్స్ మరింత ఎగ్జైట్ అవుతున్నారు.
అయితే ఈ సినిమా షూట్ మొదలైంది కానీ ఇతర తారాగణంకి సంబంధించి పెద్దగా డీటెయిల్స్ బయటికి రాలేదు. అయితే లేటెస్ట్ గా హీరోయిన్ విషయంలో ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. దీని ప్రకారం యంగ్ బ్యూటీ సంయుక్త మీనన్ నటిస్తున్నట్టు తెలుస్తుంది. గత ఏడాది బాలయ్య అఖండ 2 లో ఈ ఏడాది నారీ నారీ నడుమ మురారి సినిమాలో కనిపించిన ఆమె రామ్ సరసన ఇపుడు నటించనున్నట్టు టాక్. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది అధికారిక క్లారిటీ వస్తే తెలిసిపోతుంది.


