మళ్ళీ రేస్ లోకి వస్తున్న బన్నీ ఒకప్పటి సాలిడ్ ప్రాజెక్ట్.?

Published on May 2, 2021 1:48 pm IST

ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియన్ లెవెల్లో సెటిల్ అవ్వడం స్టార్ట్ చేసాడు. అయితే బన్నీ మొదటగా చేస్తుంది “పుష్ప” అయినా దాని కంటే ముందే దర్శకుడు శ్రీరామ్ వేణుతో “ఐకాన్” అనే పాన్ ఇండియన్ చిత్రాన్ని ప్లాన్ చేసారు. కానీ ఊహించని విధంగా పుష్ప బన్నీ మొట్ట మొదటి పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా మారింది.

అయితే ఈ రెండు సినిమాలు కాకుండా కొన్నాళ్ల కితమే మన దక్షణాది విలక్షణ దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ తో బన్నీ ఓ ప్రాజెక్ట్ లైనప్ లోకి వచ్చిందని టాక్ ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ కాస్త ఆగింది. మరి మళ్ళీ ఈ ప్రాజెక్ట్ పై బజ్ మొదలయ్యింది. అయితే పుష్ప అయ్యాక బన్నీ లైనప్ లో సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా ఉన్నాడు. మరి నెక్ట్ ప్రాజెక్ట్ బన్నీ ఎవరితో చేస్తాడో కాలమే నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం :