అల… వైకుంఠపురంలో బన్నీవి ఎన్ని షేడ్స్…?

Published on Aug 16, 2019 5:39 pm IST

అనేక ఊహాగానాలకు తెరదించుతూ అల్లు అర్జున్ నిన్న తన నూతన చిత్ర టైటిల్ ప్రకటించేశారు. ఎల్లప్పటిలాగే త్రివిక్రమ్ తన మార్కు, డిఫరెంట్ గా ఉండే క్లాసిక్ టైటిల్ నే ఫిక్స్ చేశాడు. ‘అల వైకుంఠపురంలో’ అనే విభిన్నమైన టైటిల్ తో అందరిని అలా అలరించాడు. అలాగే ఫస్ట్ గ్లిమ్స్ పేరుతో ఒక చిన్న వీడియో కూడా విడుదల చేయడం జరిగింది. మెడలో కండువా,చారల టి షర్ట్, హిప్పీ క్రాప్, ట్రిమ్డ్ షేవింగ్ తో ఉన్న అల్లు అర్జున్ మధ్యతరగతి కుటుంబంలోని పక్కింటి కుర్రాడిలా ఉన్నాడు.

ఐతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటీ అంటే గతంలో ఈమూవీకి సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ బయటకు రావడం జరిగింది. ఆ ఫోటోలలో అల్లు అర్జున్ మెడలో ఐడీ కార్డు,ఫార్మల్ డ్రెస్ లో నీట్ లుక్ లో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ గా కనిపించారు. దీనితో పల్లెటూరి కుర్రాడిలా,అలాగే ఓ సంస్థలో ఉద్యోగిలా బన్నీ రెండు విభిన్న పాత్రలలో కనిపిస్తారనిపిస్తుంది. పూజా హెగ్డే కూడా బన్నీ కొలీగ్ గా చేస్తున్నారని సమాచారం.

ఏదిఏమైనా బన్నీ జస్ట్ టైటిల్ ప్రకటనతోనే మూవీకి కావలసినంత ప్రచారం తెచ్చేశారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :