బన్నీ సుకుమార్ ల మూవీపై ఆసక్తికర పుకారు

Published on Oct 10, 2019 12:11 am IST

కొద్దిరోజుల క్రితం బన్నీ, సుకుమార్ లు మూవీ చేయనున్నట్లు ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం బన్నీ చేస్తున్న అల వైకుంఠపురంలో షూటింగ్ పూర్తయిన వెంటనే ఆయన సుకుమార్ మూవీ చిత్రీకణలో పాల్గొనాల్సివుంది. ఎటూ ఈ నెలాఖరుకి త్రివిక్రమ్ అలవైకుఠపురం షూటింగ్ కంప్లీట్ చేశే అవకాశం కలదు. దీంతో నవంబర్ లోనే సుకుమార్, బన్నీ ల చిత్రం మొదలుకావాలి, తాజాగా ఈ చిత్రంపై ఒక పుకారు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.

బన్నీ, సుకుమార్ ల చిత్రం సందిగ్ధంలో పడిందట. మూవీ స్క్రిప్ట్ విషయంలో హీరోకి, మరియు డైరెక్టర్ కి మధ్య వచ్చిన అభిప్రాయం భేదాల వలన ఈ మూవీ ఆగిపోయిందంటూ ప్రచారం జరుగుతుంది. ఇక నిన్న దసరా సందర్భంగా కూడా ఈ చిత్రంపై ఎటువంటి అప్డేట్ లేకపోవడం ఈ అనుమానాలకు ఊతం ఇస్తుంది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో సుకుమార్ రాసుకున్న ఈ కథను గతంలో కొందరు స్టార్ హీరోలు తిరస్కరించారనే వాదన ఉంది . మరి ఈ పుకారులో ఉన్న నిజమెంతో ఎవరికీ తెలియదు కానీ, కొన్ని మీడియా మాధ్యమాలలో ప్రముఖంగా రాస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More