బన్నీ లైనప్ లో మూడో స్టార్ దర్శకుడు.?

Published on May 5, 2021 3:00 pm IST

ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ తో భారీ పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప” లో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి అలాగే ఈ చిత్రం అనంతరం బన్నీ చెయ్యబోతున్న ప్రాజెక్ట్స్ కు సంబంధించి కూడా టాక్ ఆల్రెడీ మొదలయ్యింది. అయితే ఇప్పటికే సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ మరియు తమిళ్ దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ పేరు కూడా వినిపించింది.

కానీ లేటెస్ట్ గా మన తెలీవుడ్ స్టార్ దర్శకుడు వంశీ పైడి పల్లి పేరు కూడా వచ్చిందని రూమర్స్ మొదలయ్యాయి. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాల్సి ఉంది. ఈ మధ్య వంశీ పేరిట చాలానే గాసిప్పులు తిరుగుతున్నాయి. మరి ఏది నిజమవుతుందో అన్నది ఆసక్తిగా మారింది. ప్రస్తుతానికి అయితే బన్నీ తన కొవిడ్ రెస్ట్ లో ఉన్నారు. దాని తర్వాత వెంటనే మళ్ళీ పుష్ప షూట్ లో బిజీ కానున్నారు.

సంబంధిత సమాచారం :