మహేష్ తో కమల్.. నిజం కాదట !

Published on Jun 6, 2021 9:34 pm IST

విశ్వనటుడు కమల్‌ హాసన్‌, సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు కలిసి స్క్రీన్‌ పంచుకోనున్నారని.. ఓ క్రేజీ గాసిప్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. వీరిద్దర్నీ కలిపి మురుగదాస్‌ ఓ భారీ మల్టీస్టారర్‌ చేయడానికి సన్నద్ధం చేస్తున్నాడని, మురుగదాస్ స్క్రిప్ట్ వర్క్‌ కూడా పూర్తి చేశాడని, తాజాగా జోరుగా ప్రచారం అవుతోన్న ఈ వార్తలో ఎలాంటి వాస్తవం లేదట.

మురుగదాస్ ప్రస్తుతం తమిళ హీరో విజయ్ కోసం ఒక కథ రెడీ చేశాడని, అలాగే ఆ కథ మహేష్ కి సూట్ అవుతుందని.. వీరిద్దరిలో ఎవరు తనకు డేట్స్ ఇస్తే వారితో ఆ సినిమా చేయడానికి ఈ మోస్ట్‌ వాంటెడ్‌ డైరెక్టర్‌ ప్లాన్ లో ఉన్నాడట. అలాగే ఎప్పటి నుండో కమల్ హాసన్ తో కూడా ఒక సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నాడు మురుగదాస్.

ఏది ఏమైనా కమల్ – మహేష్ కలిసి నటిస్తే చూడటానికి సినీ ప్రియులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తారు. ఇక ఫ్యాన్స్ ఆనందానికి అయితే హద్దులు ఉండవనే చెప్పాలి. కానీ, ఈ కాంబినేషన్ సెట్ అవ్వడం అంత తేలిక కాదు.

సంబంధిత సమాచారం :