మరి బాలయ్య మేకర్స్ ఏం చేస్తారో చూడాలి.!

Published on Apr 30, 2021 7:02 am IST

ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న సాలిడ్ మాస్ మసాలా ఎంటర్టైనర్ “అఖండ” టీజర్ టైటిల్ కు తగ్గట్టుగానే అఖండమైన రెస్పాన్స్ ను కొల్లగొడుతుంది. మరి దీనితో పాటుగా మరోపక్క మరిన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా ఈ సినిమాపై తెలుస్తున్నాయి.

అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో సీనియర్ హీరోలు అయిన మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ఆచార్య” ఆల్రెడీ వచ్చే మే లో విడుదల లేదని కన్ఫర్మ్ చేసేసారు. అలాగే మరో సీనియర్ కథానాయకుడు విక్టరీ వెంకటేష్ నటించిన “నారప్ప” కూడా ఆచార్య బాటలోనే వాయిదా వేసినట్టు నిన్ననే తెలిపారు.

ఇక మిగిలి ఉంది బాలయ్య సినిమా కాబట్టి ఇది కూడా వాయిదా పడుతుందా లేదా అన్నది ఆసక్తిగా మారింది. ఇప్పటికే దాదాపు షూటింగ్ కంప్లీట్ కావచ్చిన ఈ చిత్రం చెప్పిన సమయానికి మేకర్స్ తీసుకొస్తారా లేక వాటిలానే అందాక వాయిదా వేస్తారా అన్నది చూడాలి. మరి ఈ చిత్రాన్ని బోయపాటి శ్రీను దర్శకత్వం వహించగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ద్వారకా క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు..

సంబంధిత సమాచారం :