బాలయ్య రిస్క్ చేస్తున్నాడా ?

Published on Jun 12, 2021 5:02 pm IST

నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ పై బాలయ్య అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. నిజానికి 2017లోనే తన కొడుకు మోక్షజ్ఞ తెరంగేట్రం ఉంటుందని బాలయ్య క్లారిటీ ఇచ్చారు. అయితే, ఆ తర్వాత మోక్షజ్ఞకు యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ లేదని వార్తలు వచ్చాయి. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం హీరో అయ్యే దిశగా మోక్షు కసరత్తులు చేస్తున్నాడని తెలుస్తోంది.

రీసెంట్ గా బాలయ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో మీడియాతో మాట్లాడుతూ కొడుకు ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చాడు. మోక్షజ్ఞ ఎంట్రీ మూవీ ‘ఆదిత్య 369’ సీక్వెల్ అట, పైగా మోక్షజ్ఞ తెరంగేట్రం చేయబోతున్న సినిమాని తనే డైరెక్ట్ చేయబొతున్నట్లు కూడా బాలయ్య చెప్పాడు. ఐతే ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనే విషయంలో మాత్రం బాలయ్య క్లారిటీ ఇవ్వలేదు.

ఇంతకీ బాలయ్య కుమారుడి మొదటి సినిమాని తానే డైరెక్ట్ చేస్తూ బాలయ్య రిస్క్ చేస్తున్నాడా ? అని అభిమానులు టెన్షన్ పడుతున్నారు.

సంబంధిత సమాచారం :