
అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య ప్రస్తుతం తన కెరీర్లో ఏ మాత్రం గ్యాప్ తీసుకోవడం లేదు. చకచకా తన సినిమాలను ఫినిష్ చేస్తున్నాడు. తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన గౌతమ్ వాసుదేవ్ మీనన్ తో ‘సాహసం శ్వాసగా సాగిపో’ షూటింగ్ పూర్తి చేసిన నాగ చైతన్య కేవలం వారం రోజుల గ్యాప్ లో తన తదుపరి సినిమా ‘మజ్ను’ని మొదలు పెట్టేసాడు. మలయాళ సూపర్ హిట్ ‘ప్రేమమ్’కి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. నవంబర్ 30న లాంచ్ చేసిన ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ప్రస్తుతం విజాగ్ లో జరుగుతోంది. ఈ షెడ్యూల్ లో శృతి హాసన్ కూడా పాల్గొంటోంది.
మొత్తం ముగ్గురు హీరోయిన్స్ ఉన్న ఈ సినిమాలో శృతి హాసన్ తో పాటు, అనుపమ పరమేశ్వరన్ ని కూడా మరో హీరోయిన్ గా సెలక్ట్ చేసారు. వీరిద్దరి తర్వాత మూడవ హీరోయిన్ కోసం అన్విశిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం మూడవ హీరోయిన్ గా ఐషా శర్మని తీసుకునే అవకాశం ఎక్కువ కనిపిస్తోందని అన్నారు. కానీ ఇప్పుడు మరో క్రేజీ హీరోయిన్ పేరు వినిపిస్తోంది. కొత్త భామ అయిన ఐషా శర్మ కంటే పేరున్న రెజీన అయితే బాగుంటుందని ఈ చిత్ర టీం భావిస్తోంది. దాని ప్రకారమే తనతో చర్చలు కూడా జరుపుతోందని సమాచారం. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా రిలీజ్ చేయనున్నారు. కార్తికేయ ఫేం చందూ మొండేటి ఈ రీమేక్ కి దర్శకత్వం వహిస్తున్నాడు.

