చరణ్ నెక్స్ట్ కూడా పాన్ ఇండియన్ లెవెల్లో ఉంటుందా.?

Published on Jan 10, 2021 4:00 pm IST

ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ రెండు భారీ మల్టీ స్టారర్ చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. వాటిలో ఒకటి రాజమౌళితో చేస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” కాగా మరొకటి మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివతో తెరకెక్కిస్తున్న “ఆచార్య” కూడా ఒకటి.

మరి ఇదిలా ఉండగా చరణ్ ఈ రెండు సినిమాల తర్వాత ఏ దర్శకునితో ఎలాంటి సినిమా చేస్తాడో అన్నది కూడా మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. మరి చరణ్ నెక్స్ట్ లో పలువురు టాలెంటెడ్ దర్శకుల పేర్లే వినిపిస్తున్న నేపథ్యంలో లేటెస్ట్ సెన్సేషన్ లోకేష్ కనగ్ రాజ్ పేరు రేస్ లోకి వచ్చింది.

అంతే కాకుండా ఈ సాలిడ్ కాంబో సెట్టయ్యేలా ఉందనే స్ట్రాంగ్ బజ్ కూడా వినిపిస్తుంది. మరి ఒకవేళ ఈ కాంబో సెట్టయితే మళ్ళీ పాన్ ఇండియన్ సినిమాగానే ఉంటుందా అంటే అందుకు ఆస్కారం లేదని చెప్పడానికి లేదు. మాస్టర్ తో పాన్ ఇండియన్ లెవెల్ అటెన్షన్ ను గ్రాబ్ చేసాడు.

మరి ఎలాగో “RRR” తర్వాత చరణ్ కి కూడా పాన్ ఇండియన్ మార్కెట్ పెరగడం ఖాయం సో ఈ కాంబో కనుక సెట్టయితే మాత్రం అది కూడా పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ అవ్వడం సాధ్యమే అని చెప్పాలి. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :