చరణ్ మళ్ళీ ఐసోలేషన్ లోకి.?

Published on Apr 23, 2021 9:00 pm IST

ఇప్పుడు మళ్ళీ కోవిడ్ ప్రబలుతున్న సమయంలో పలువురు రాజకీయ నాయకులూ ఎక్కువగా టాలీవుడ్ నటులు మళ్ళీ కోవిడ్ బారిన పడుతున్నారు. అయితే సెకండ్ వేవ్ శరవేగంగా వ్యాప్తి చెందుతుండడంతో ఆల్ మోస్ట్ టాలీవుడ్ లో అన్ని సినిమాలు కూడా షూటింగ్స్ ఆపుకున్నాయి.ఇదిలా ఉండగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తన సినిమా షూటింగ్స్ ఆపుకున్నారు.

అయితే ఇది వరకే చరణ్ కరోనా బారిన పడి తిరిగి కోలుకున్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు మళ్ళీ ఐసోలేషన్ లోకి వెళ్లినట్టుగా సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల తన వాన్ డ్రైవర్ కోవిడ్ బారిన పడడంతో చరణ్ ఐసోలేషన్ లోకి వెళ్లారట. అయితే దురదృష్టవశాత్తు తన వ్యాన్ డ్రైవర్ కరోనా మృతి చెందినట్టు తెలుస్తుంది.. మరి చరణ్ ఆరోగ్య పరిస్థితి ఏమిటి అన్నది తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :