స్పెషల్ డే కు “RRR” టీం ప్లాన్ మారిందా.?

Published on Jan 20, 2021 7:01 am IST

మన టాలీవుడ్ నుంచి వస్తున్న పలు భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాల్లో మోస్ట్ ప్రిస్టేజియోస్ ప్రాజెక్ట్ “రౌద్రం రణం రూధిరం” కూడా ఒకటి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రం ఇప్పుడు క్లైమాక్స్ చిత్రీకరణలో ఉంది. మరి ఇప్పటికే ఇరువురి హీరోల పైనా వచ్చిన టీజర్ లకు భారీ స్థాయి స్పందన వచ్చింది.

అయితే గత కొన్ని రోజుల కితం వరకు మాత్రం ఈ సినిమా నుంచి సిసలైన టీజర్ ను మేకర్స్ ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేయాలని అనుకుంటున్నట్టుగా టాక్ వినిపించింది. కానీ లేటెస్ట్ గా మాత్రం ఈ ప్లాన్ మారినట్లు తెలుస్తుంది. ఆరోజున టీజర్ కాకుండా జస్ట్ చిన్నపాటి గ్లిమ్ప్ప్ వీడియోను మాత్రమే పెద్దగా ఏమి రివీల్ చెయ్యకుండా చేయనున్నట్టుగా తెలుస్తుంది. మరి దీనిపై ఇంకా సరైన సమాచారం రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :

More