నిజంగానే రిస్క్ తీసుకుంటున్న దేవరకొండ…!

Published on Aug 29, 2019 11:32 pm IST

దేవరకొండ నిన్న ఒక చిన్న సైజు సంచలనానికి తెరతీశారు. తన నిర్మాణ సారధ్యంలో తెరకెక్కనున్న చిత్ర టైటిల్, హీరోని ప్రకటించేశారు. వివరాలలోకి వెళితే ది కింగ్ అఫ్ హిల్స్ పేరుతో ఓ నిర్మాణ సంస్థను స్థాపించిన విజయ్ దేవరకొండ, ఆ బ్యానర్ లో తొలిచిత్రంగా “మీకు మాత్రమే చెవుతా” అనే ఓ భిన్నమైన టైటిల్ కలిగిన చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు ప్రకటించాడు. మరో విశేషం ఏమిటంటే ఆ మూవీలో హీరోగా దర్శకుడు తరుణ్ భాస్కర్ ని ఎంపిక చేశాడు.

ఈ విషయాన్ని నిన్న ఓ ఆసక్తికర వీడియో ద్వారా వివరించిన దేవరకొండ, ట్విట్టర్ వేదికగా తన మనోభావాలు పంచుకున్నారు. నిర్మాణం అనేది చాలా రిస్క్ తో కూడుకున్నదని నాకు తెలుసు, కానీ రిస్క్ లేకపోతే లైఫ్ ఏముంది. అందుకే ది కింగ్ అఫ్ హిల్స్ బ్యానర్ పై మీకు మాత్రమే చెవుతా చిత్రం నిర్మిస్తున్నట్లు వెల్లడించాడు.
హీరోగా ఎదుగుతున్న తరుణంలో విజయ్ నిర్మాణంలోకి అడుగుపెడటం అనేది నిజంగా రిస్క్ అనే చెప్పాలి. హీరోగా తన ధ్యాస మొత్తం మంచి కథల ఎంపిక పై కాకుండా ఇలా చిత్ర నిర్మాణం పై పెట్టడం అతని కెరీర్ కి అంత మంచిది కాదు. ఏమైనా నిజంగా విజయ్ లేనిపోని రిస్క్ తీసుకుంటున్నాడనిపిస్తుంది.

సంబంధిత సమాచారం :