ఈ ఏడాది టాలీవుడ్ దగ్గర ఉగాది కానుకగా థియేటర్స్ లో రిలీజ్ కి రాబోతున్న పలు చిత్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అవైటెడ్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఒకటి. మరి ఈ సినిమా కోసం చూస్తున్న అభిమానులకి ఈ ఉగాది రేస్ లో సోలో రిలీజ్ దక్కింది అని అనుకున్నారు కానీ లేటెస్ట్ గా ధురంధర్ 2 ట్విస్ట్ ఇచ్చింది. ఈ బాలీవుడ్ సీక్వెల్ పై మంచి హైప్ ఉంది.
తెలుగు ఆడియెన్స్ లో కూడా మంచి దీనిపై ఉండగా ఇన్ని రోజులు ఈ సినిమా రిలీజ్ పై పెద్దగా ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో ఈ సినిమా మార్చ్ 19కి లేదు అనే అనుకున్నారు. కానీ సీన్ కట్ చేస్తే ఈ సినిమా రిలీజ్ ఉంది అని మేకర్స్ ప్రకటించారు. సో ఈ అనౌన్స్మెంట్ తో తెలుగు స్టేట్స్ లో ఉస్తాద్ భగత్ సింగ్ కి ముప్పు లేదా అంటే ఎఫెక్ట్ డెఫినెట్ గా ఉంటుంది. మెయిన్ గా ఇది థియేటర్స్ పరంగా రావొచ్చు. ఆ సినిమాకి బజ్ అయితే ఉంది కానీ మరీ మాస్ సెంటర్స్ లో పవన్ సినిమా రేంజ్ రీచ్ అంటే కష్టమే. సో కొంతమేర ఎఫెక్ట్ ఉండొచ్చు కానీ యునానిమాస్ డామినేషన్ అంటే కష్టమే.


