‘ఓజి 2’కి వీరు తప్పుకున్నట్టేనా!

‘ఓజి 2’కి వీరు తప్పుకున్నట్టేనా!

Published on Jun 22, 2026 12:00 AM IST

OG

ఇప్పుడు టాలీవుడ్ నుంచి భారీ హైప్ లో ఉన్న అతికొద్ది సినిమాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించనున్న ఓజి 2 కూడా ఒకటి. దర్శకుడు సుజీత్ తెరకెక్కించనున్న ఈ సినిమాపై హైప్ అంతా వేరే లెవెల్లో ఉంది. పవన్ కూడా ఈ సినిమా పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్న నేపథ్యంలో అభిమానులు ఈ సినిమా పట్ల మరింత ఎగ్జైటెడ్ గా ఉన్నారు.

అయితే ఈ సినిమా విషయంలో ముందు మేకర్స్ డివివి ఎంటర్టైన్మెంట్స్ వారు అధికారికంగా తప్పుకున్నట్టే అనుకోవాలి. ఎందుకంటే ఓజి 2 విషయంలో కేవలం పవన్ నిర్మాణ సంస్థ నుంచి అప్డేట్స్ వస్తున్నాయి తప్పితే ఒక్క అప్డేట్ కూడా వీరి నుంచి పడలేదు. సో ఈ సినిమా నుంచి వారు తప్పుకున్నట్టే అనుకోవాలి. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే పవన్ సహా మరో నిర్మాత ఈ సినిమాకి నిర్మాణం వహించే అవకాశం ఉందని టాక్. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు