‘రణబాలి’లో ఫాంటసీ టచ్ కూడానా?

‘రణబాలి’లో ఫాంటసీ టచ్ కూడానా?

Published on Sep 10, 2026 7:00 AM IST

టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా తన భార్య రష్మిక మందన్నా హీరోయిన్ జిక్క్ దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కించిన పీరియాడిక్ మరియు హిస్టారికల్ చిత్రమే రణబాలి  లేటెస్ట్ గా వచ్చిన టీజర్ చూసి విజయ్ దేవరకొండ అభిమానులు తమ ఫేవరెట్ హీరో కంబ్యాక్ ఇవ్వడం గ్యారెంటీ అని ఫిక్స్ అయిపోయారు.

అయితే ఈ చిత్రం స్వాతంత్రం బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కించినట్టు అర్థం అవుతుంది. తెలుగు మట్టికి చెందిన ఒక స్వాతంత్ర సమరయోధుడు జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. అందుకు తగ్గట్టుగానే అప్పటి పరిస్థితులు తిరుగుబాటు, పోరాటం వంటి సన్నివేశాలు కట్టినట్టు చూపించారు.

కానీ టీజర్ లో చివరకు కొన్ని క్షణాల్లో చూపించిన విజువల్స్ లో ఫాంటసీ టచ్ కూడా ఉందా అని డౌట్ ఇప్పుడు స్టార్ట్ అయింది. అది ఒకవేళ నిజ జీవిత సంఘటనలు ఆధారంగా తెరకెక్కించినట్టు అయితే ఇది కల్పితమా లేక నిజమేనా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి అజయ్ అతుల్ సంగీతం అందించారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించిన ఈ సినిమా గ్రాండ్ గా అక్టోబర్ 16న విడుదల కాబోతోంది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు