ఓటిటిలో “హను మాన్” ఊహించని ప్లానింగ్? అందుకే ఈ ఆలస్యం!?

ఓటిటిలో “హను మాన్” ఊహించని ప్లానింగ్? అందుకే ఈ ఆలస్యం!?

Published on Mar 15, 2024 4:53 PM IST


టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన లేటెస్ట్ భారీ చిత్రం “హను మాన్” (Hanu Man Movie). మరి ఈ చిత్రం అనౌన్స్ అయ్యిన నాటి నుంచి సాలిడ్ హైప్ అండ్ బజ్ ని క్రియేట్ చేయగా ఇప్పుడు ఎట్టకేలకి ఓటిటి రిలీజ్ కి సంసిద్ధం అవుతుంది. కానీ ఇంకా థియేటర్స్ లో పలు చోట్ల మంచి రన్ ని కనబరుస్తుండడం విశేషం.

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా ఓటిటి రిలీజ్ (Hanu Man OTT Release) కోసం ఎదురు చూస్తున్నవారు అంతకంతకు ఎక్కువ అవుతుండడంతో గట్టి డిమాండ్ కూడా నెలకొంది. అయితే దీనిపై లేటెస్ట్ గా దర్శకుడు ప్రశాంత్ వర్మ కూడా స్పందించాడు. హను మాన్ ఓటిటి రిలీజ్ ని తాము కావాలని ఆలస్యం చేయడం లేదని కొన్ని పనులు ఇంకా బ్యాలన్స్ ఉండడం వల్ల వాటిలో బిజీ మూలాన ఆలస్యం అయ్యింది అని త్వరలోనే రిలీజ్ కి తీసుకొస్తామని కన్ఫర్మ్ చేసాడు.

అయితే రీసెంట్ టైం లో ఏ సినిమాకి కూడా ఇంత ఆలస్యం అవ్వలేదు. వచ్చిన మూడు వారాలకే ఓటిటి లో దర్శనం ఇచ్చిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. మరి హను మాన్ కి ఇంత ఆలస్యం అంటే అన్ కట్ వెర్షన్ ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా అనేది ఇప్పుడు ఆసక్తిగా అనిపిస్తుంది. ఓటిటి వెర్షన్ కి కొన్ని సీన్స్ కానీ లేదా ఒక సాంగ్ కూడా ఎక్స్ టెండ్ చేసే అవకాశం లేకపోలేదు.

ఈ చిత్రంలో సూపర్ హీరో సాంగ్ ఒకటి అప్పట్లో రిలీజ్ చేశారు. ఇది సినిమాలో ఫుల్ లెంగ్త్ లో లేనే లేదు. మరి థియేట్రికల్ గా మిస్ చేసిన అంశాలు ఏమన్నా ఓటిటి వెర్షన్ కి జోడిస్తున్నారా? అందుకే ఈ ఆలస్యం కావచ్చని చెప్పాలి. మరి నిజంగా ప్రశాంత్ అండ్ టీం ఏం ప్లాన్ చేస్తున్నారో వేచి చూడాలి. ఇక ఈ చిత్రానికి గౌర హరీష్ సంగీతం అందించగా నిరంజన్ రెడ్డి నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు