ఆ హీరోకి 40 కోట్లు అవసరమా ?

Published on Apr 25, 2019 3:00 am IST

తెలుగులో మినిమమ్ గ్యారెంటీ హీరోల లిస్ట్ లో ముందు వరుసలో ఉండే గోపిచంద్ పేరు ఈ మధ్య అసలు కనిపించట్లేదు. గత కొన్ని సినిమాలుగా బాక్సాఫీస్ వద్ద గోపిచంద్ వరుస ప్లాప్ లతో సతమతమవుతున్నాడు, అస్సలు కలిసి రావడం లేదు. దాంతో సహజంగానే గోపీచంద్ మార్కెట్ దారుణంగా పడిపోయింది. కానీ ఈ విషయాలను ఏం పట్టించుకోని నిర్మాత అనిల్ సుంకర తమిళ్ డైరెక్టర్ తిరు దర్శకత్వంలో గోపీచంద్ చేస్తున్న కొత్త చిత్రానికి భారీగా ఖర్చు పెడుతూ.. రోజురోజుకి బడ్జెక్ట్ పెంచుకుంటూ పోతున్నారు.

కాగా ఇప్పటికే కీలక భాగం షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా 40 కోట్లు దాటేలా ఉంది. ఇండో -పాక్ బోర్డర్ పరిసర ప్రాంతాల్లో లాంగ్ షెడ్యూల్స్ షూట్ చెయ్యడం.. పైగా సినిమాలో బడ్జెట్ తో కుడనుకున్న యాక్షన్ సన్నివేశాలు ఎక్కువ ఉండటంతో ఇప్పటివరకూ భారీగానే ఖర్చు అయిందట. దాంతో మొదట 32కోట్ల అనుకున్న బడ్జెట్ కాస్త, ఇప్పుడు 40 కోట్లు దాటేలా ఉందట.

మరి గోపీచంద్ పైనా నలభై కోట్లు వర్కౌట్ అవుతాయా ? ఇంతకి ఇంత పెద్ద మొత్తం రికవరీ కావాలంటే సినిమాకు బ్లాక్ బ్లాస్టర్ టాక్ రావాల్సిందే. వచ్చినా ఇంతవరకు గోపీచంద్ సినిమా 40 కోట్లు కలెక్ట్ చేసింది లేదాయ్యే.

సంబంధిత సమాచారం :