బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ మంచి హిట్ కోసం చూస్తున్నాడు. ఆల్రెడీ సౌత్ సినిమా నుంచి కూడా ఓ క్రేజీ ప్రాజెక్ట్ ని తాను లాక్ చేసుకోగా తన నెక్స్ట్ సినిమా ఎప్పుడు ఎవరితో అనేవి ఆసక్తిగా మారాయి. అయితే హృతిక్ రోషన్ లైనప్ కి సంబంధించి లేటెస్ట్ గా క్రేజీ రూమర్ ఒకటి ఇపుడు వినిపిస్తుంది. దీని ప్రకారం హృతిక్ కోసం 800 కోట్ల బాక్సాఫీస్ వసూళ్ల ట్రాక్ రికార్డు ఉన్న దర్శకుడు లైన్ లోకి వచ్చినట్టు తెలుస్తుంది.
ఛావా దర్శకునితో హృతిక్ నెక్స్ట్?
బాలీవుడ్ లో ఇటీవల వచ్చిన పలు బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో టాలెంటెడ్ హీరో విక్కీ కౌశల్ హీరోగా నటించిన “ఛావా” కలిగించిన ఇంపాక్ట్ ని ఆడియెన్స్ అంత తేలిగ్గా మర్చిపోలేరు. హిందీ రన్ తో తెలుగులో కూడా మంచి డిమాండ్ ఏర్పడి మన దగ్గరా రిలీజ్ అయ్యింది ఈ సినిమా. మరి అలాంటి సినిమాని తెరకెక్కించిన దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ నెక్స్ట్ హృతిక్ రోషన్ ని ఓ భారీ బడ్జెట్ సినిమా తీయనున్నట్టు టాక్ మొదలైంది. దీనితో ఈ క్రేజీ కాంబినేషన్ క్లారిటీ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


