‘జన నాయకుడు’.. ఈసారి మరింత కొత్తగా?

‘జన నాయకుడు’.. ఈసారి మరింత కొత్తగా?

Published on Jul 17, 2026 10:59 AM IST

Jana Nayagan

ప్రస్తుతం కోలీవుడ్ ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ చిత్రమే ‘జన నాయగన్’. దళపతి విజయ్ హీరోగా నటించిన ఈ చిత్రం తాను సీఎం అయ్యాక థియేటర్స్ లో విడుదల కాబోతుంది. దర్శకుడు హెచ్ వినోద్ తెరకెక్కించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ బాలయ్య భగవంత్ కేసరికి రీమేక్ గా తెరకెక్కిన సంగతి తెలిసిందే.

అయితే దీనికి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి వినిపిస్తుంది. గతంలో రావాల్సిన ప్రింట్ కి ఇప్పుడు వస్తున్న ప్రింట్ కి మేకర్స్ చాలానే మార్పులు చేర్పులు కూడా చేశారట. అప్పటికి ప్లాన్ చేసిన సీన్స్ కాకుండా మరిన్ని సీన్స్ సహా పాటలు కూడా యాడ్ చేసినట్టు సినీ వర్గాలు చెబుతున్నాయి.

సో ఈసారి జన నాయకుడు మరింత కొత్తగా రాబోతున్నాడు అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తోండగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. అలాగే మమితా బైజు కీలక పాత్రలో నటించగా కే వి ఎన్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించారు

తాజా వార్తలు