గెస్ట్ రోల్ కోసం భారీగా తీసుకున్న కాజల్?

Published on Aug 7, 2020 3:00 am IST


రానా నటించిన పాన్ ఇండియా మూవీ హాతీ మేరీ సాతి. ఈ చిత్రంలో రానాతో పాటు కాజల్ కూడా నటించారట. అయితే ఈ చిత్రంలో కాజల్ ది గెస్ట్ రోల్ గా చెబుతున్నారు.సినిమాలోని కీలకమైన గిరిజన యువతి పాత్రకు గాను కాజల్ చేశారట. గిరిజన యువతి పాత్ర అవ్వడంతో బ్లౌజ్ లేకుండా చీర కట్టుకుతోనే కాజల్ కనిపిస్తుందట.

దాదాపు ముప్పై నిమిషాల స్క్రీన్ ప్రజెన్స్ ఉండే కాజల్ ఏకంగా 70 లక్షల వరకు పారితోషికం తీసుకుంటుందట. ప్రస్తుతం ఈమె చిరంజీవి ఆచార్యతో పాటు కమల్ ఇండియన్ 2 వంటి బిగ్గెస్ట్ భారీ చిత్రాల్లో నటిస్తుంది. కనుక రానాతో కలిసి నటించేందుకు ఆ మాత్రం డిమాండ్ చేయడం కామన్. కాజల్ కు ఉన్న క్రేజ్ నేపథ్యంలో సినిమాకు ఆమె పాజిటివ్ గా నిలుస్తుందనే నమ్మకంతో మేకర్స్ ఆమెను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :

More