లేటెస్ట్..”కేజీయఫ్ 2″ రిలీజ్ డేట్ పై అనౌన్స్మెంట్..?

Published on Jul 8, 2021 4:54 pm IST


కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కించిన లేటెస్ట్ భారీ పాన్ ఇండియన్ చిత్రం “కేజీయఫ్ చాప్టర్ 2”. పాన్ ఇండియన్ లెవెల్లో భయంకరమైన అంచనాలు ఉన్న బిగ్ ప్రాజెక్ట్స్ లో ఇది ఒకటి. మోస్ట్ అవైటెడ్ గా ఉన్న ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ ఎప్పుడెప్పుడు ఉంటుందా అన్న దానిపై ఇటీవల మేకర్స్ కొంచెం హింట్ ఇచ్చారు.

అలాగే ఇటీవలే కేజీయఫ్ 2 తమిళ హక్కులు డ్రీం వారియర్ వారు భారీ మొత్తంతో కొన్నారని కూడా తెలియగా ఇప్పుడు కేజీయఫ్ 2 కొత్త రిలీజ్ డేట్ ను త్వరలో అనౌన్స్ చేస్తారని బజ్ వినిపిస్తుంది. అయితే కొన్ని రోజుల కితమే ఈ సినిమా అసలు విడుదల తేదీన కొత్త డేట్ ను ప్రకటిస్తారని తెలిసింది. మరి ఆ అప్డేట్ అప్పుడే వస్తుందా ఏమో అన్నది చూడాలి. మరి ఈ భారీ చిత్రంలో సంజయ్ దత్ పవర్ ఫుల్ విలన్ రోల్ లో నటిస్తుండగా ప్రకాష్ రాజ్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :