“కేజీయఫ్ 2” ఈ రేస్ కి షిఫ్ట్ అవుతుందా.?

Published on May 9, 2021 4:00 pm IST

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన భారీ యాక్షన్ చిత్రం “కేజీయఫ్ చాప్టర్ 2”. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రంపై పాన్ ఇండియన్ వైడ్ ఎలాంటి అంచనాలు నెలకొన్నాయో తెలిసిందే. అలాగే ఈ చిత్రం విడుదల తేదీ కూడా ఆల్రెడీ ఫిక్స్ అయ్యింది.

కానీ ఊహించని విధంగా కరోనా మళ్ళీ విజృంభిస్తుండడంతో కేసులు అమాంతం పెరిగాయి దీనితో ఇప్పటికే అనేక చిత్రాలు వాయిదా పడ్డాయి. అయితే మరి కేజీయఫ్ 2 పై ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం బయటకి రాలేదు కానీ ఇది కూడా వాయిదా పడే అవకాశం ఉందని సూచనలు వినిపిస్తున్నాయి.

అలాగే ఈ చిత్రం ఒకవేళ షిఫ్ట్ అయితే ఎప్పటికి అన్న టాక్ వస్తే దసరా రేస్ లోకే అని తెలుస్తుంది. మరి ఇప్పటికే ఆ రేస్ లో పలు బడా సినిమాలు ఉన్నాయి. మరి ఏం జరగనుందో అన్నది కాలమే నిర్ణయించాలి. ఇక ఈ భారీ చిత్రంలో బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ పవర్ ఫుల్ విలన్ గా నటిస్తుండగా ప్రకాష్ రాజ్ మరియు రావు రమేష్ లు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం :