అప్పుడు మిస్ చేసిన కొరటాల ఇప్పుడు ఇస్తారా.?

Published on May 30, 2021 11:00 pm IST

మన టాలీవుడ్ లో తన మొదటి సినిమా నుంచి దర్శకునిగా అపజయం ఎరుగని అతి కొద్ది మంది దర్శకుల్లో బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ కూడా ఒకరు. మరి ప్రస్తుతం కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవితో “ఆచార్య” అనే భారీ బడ్జెట్ మల్టీ స్టారర్ చిత్రాన్ని చేస్తున్నారు. అయితే ఈ సినిమా అనంతరం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మరోసారి తన ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసేసారు. దీనితో ఈ మాస్ కాంబో మళ్ళీ రిపీట్ కానుండడంతో ఎన్నో అంచనాలు సెట్టయ్యాయి.

అయితే ఈ సినిమా నుంచి ఒక సాలిడ్ అప్డేట్ గత మే 20 తారక్ పుట్టినరోజు సందర్భంగా అప్డేట్ వస్తుంది అని అంతా ఆశించారు. కానీ అలాంటివి ఏమీ లేకుండానే కొరటాల ముగించేశారు. దీనితో అప్పుడు మిస్ చేసిన అప్డేట్ వచ్చే జూన్ 15 న వస్తుందేమో అని యంగ్ టైగర్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆరోజే ఎందుకంటే ఆ డేట్ కి కొరటాల బర్త్ డే ఉండడంతో ఎక్కడో చిన్న హోప్ పెట్టుకున్నారు. మరి ఆ స్పెషల్ డే కి వారు అనుకున్న అప్డేట్ వస్తుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :