బిగ్ బాస్ 5 లో జాంబీ రెడ్డి నటి!?

Published on Aug 6, 2021 12:19 pm IST

ప్రముఖ బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ త్వరలో ప్రేక్షకులని అలరించడానికి సిద్దం అవుతుంది. అయితే ఈ కార్యక్రమం నిర్వహణ పై ఇప్పటికే స్టార్ మా అధికారిక ప్రకటన సైతం చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ప్రోమో ను షూట్ చేసే పనిలో బిజీగా ఉంది టీమ్. అయితే ఈ బిగ్ బాస్ షో లో ఈసారి ఎవరెవరు ఉంటారు అనే దాని పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే జాంబీరెడ్డి చిత్రం లో నటించిన లహరి శారి ఈసారి హౌజ్ లో ఉండనుంది అని సమాచారం. అయితే ఈ సారి కూడా బిగ్ బాస్ రియాలిటీ షో కి అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ బుల్లితెర రియాలిటీ షో కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :