టాక్..’లవ్ స్టోరీ’ వాయిదా పడనుందా.?

Published on Aug 28, 2021 11:55 am IST

ప్రస్తుతం టాలీవుడ్ నుంచి ఆల్రెడీ రిలీజ్ కి రెడీ అయ్యిన చిత్రాల్లో అక్కినేని యువ సామ్రాట్ నాగ చైతన్య హీరోగా నాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా మ్యాజికల్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం “లవ్ స్టోరీ” కూడా ఒకటి. ఈ ఏడాది వినాయక చవితి కానుకగా వచ్చే సెప్టెంబర్ 10న రిలీజ్ కి ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు ఈ చిత్రం రిలీజ్ డేట్ పై లేటెస్ట్ టాక్ ఒకటి వినిపిస్తుంది.

బహుశా ఈ చిత్రం ఈ తేదీ నుంచి వాయిదా పడొచ్చట. ఇది వరకే నాని నటించిన “టక్ జగదీష్” చిత్రం ఇదే తారీఖున రానుంది అని బజ్ వినిపించినప్పుడే ఇండస్ట్రీలో కాస్త గందరగోళం నెలకొంది. అయితే అప్పుడుకి అధికారిక క్లారిటీ లేకపోయినా నిన్న డేట్ అనౌన్సమెంట్ వచ్చింది. దీనితో రెండు చిత్రాలు ఒకే తారీఖున అంటే ఎఫెక్ట్ పడుతుంది అని మళ్ళీ వాయిదా వేస్తున్నట్టుగా టాక్. అయితే ఇంకా ఇందులో ఈనాటి అధికారిక క్లారిటీ లేదు కావున ఆ క్లారిటీ వచ్చే వరకు వేచి ఉంటే మెరుగు..

సంబంధిత సమాచారం :