‘మహర్షి’ టీజర్ విడుదల ఎప్పుడంటే.. !

Published on Apr 1, 2019 6:00 pm IST

‘మహర్షి’ సినిమా లేటెస్ట్ అప్ డేట్స్ కోసం సూపర్ స్టార్ అభిమానాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారి ఆసక్తి తగ్గట్లుగానే తాజాగా ఒక అప్ డేట్ తెలిసింది. మహర్షి కోసం మహేష్ బాబు ఈ రోజు తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం మొదలుపెట్టారు. అలాగే మహర్షి టీజర్ ను ఈ నెల 6వ తేదీన ఉగాది స్పెషల్ గా విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ చిత్రం మే 9న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతున్నది. ఈ చిత్రానికి మ్యూజిక్ సంచలనం దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మహర్షిలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ప్రముఖ కామెడీ హీరో అల్లరి నరేష్ కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అశ్వినీదత్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు

సంబంధిత సమాచారం :