మహేష్, త్రివిక్రమ్ కాంబోపై అప్డేట్ ఈరోజేనా.?

Published on May 1, 2021 7:03 am IST

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ హీరోగా పరశురాం దర్శకత్వంలో “సర్కారు వారి పాట” అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమాపై ఎన్ని అంచనాలు ఉన్నాయో కూడా అందరికీ తెలుసు. ఇక ఈ చిత్రం తర్వాత ఏ దర్శకుడిని లైన్ లో పెడతారా అని అనుకున్న టైం లో తన క్లాసిక్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ను సెట్ చేసుకున్నారు.

ఇక అక్కడ నుంచి ఈకాంబోపై మరిన్ని అంచనాలు.. అయితే ఇప్పుడు ఈ కాంబోకు సంబంధించి నయా రూమర్ స్ప్రెడ్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ అధికారికంగా ప్రకటించేది ఈరోజే అని తెలుస్తుంది. మరి ఇందులో ఎంత మేర నిజముందో కానీ వేచి చూస్తే కానీ తెలియదు అది జస్ట్ రూమరా లేక నిజమేనా అన్నది.. మాములుగా అయితే ఈ 30న ఉండొచ్చు అని తెలిసింది. మరి ఇప్పుడు అడ్వాన్స్ గా అప్డేట్ వస్తుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :