మహేష్ సినిమా కూడా ఆగిందా.?

Published on Apr 21, 2021 5:43 pm IST

ఇప్పుడిప్పుడే మళ్ళీ అంతా సరి అవుతుంది అనుకున్న సమయంలోనే మళ్ళీ కరోనా పంజా విసిరింది. ముఖ్యంగా ఎంతో నష్టపోయిన సినీ పరిశ్రమ మళ్ళీ ఊపిరి పోసుకుంటుంది అనుకుంటే ఊహించని విధంగా వచ్చిన సెకండ్ వేవ్ విడుదలలకు సినిమా షూటింగ్స్ కు కూడా బ్రేక్ వేసింది.

ఇప్పటికే అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్న అన్ని సినిమాలు కూస్తో వేసుకున్న ప్లాన్స్ ఆపుకోవాల్సి వస్తుంది. మరి ఇదిలా ఉండగా ఈ లిస్ట్ లో ఇపుడు సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “సర్కారు వారి పాట” కూడా యాడ్ అయ్యినట్టు తెలుస్తుంది. కోవిడ్ పరంగా అయితే ఎక్కువ గ్యాప్ తీసుకున్నది ఈ చిత్ర యూనిట్ నే..

సరే ఎట్టకేలకు మళ్ళీ మొదలు పెట్టిన కొన్ని రోజులకే ఆ షెడ్యూల్ ను తాత్కాలికంగా నిలిపివేసినట్టు తెలుస్తుంది. ఈ నెలాఖరు వారు ప్లాన్ చేసిన మొత్తం షూట్ ను ఇప్పుడు ఆపేసి తర్వాత కుదిరినప్పుడు తీయాలని ప్లాన్ మారుస్తున్నారట. మొత్తానికి మహేష్ కూడా వెనక్కి తగ్గారని చెప్పాలి.

సంబంధిత సమాచారం :