బన్నీ దీపావళి గిఫ్ట్ రెడీ చేశారు, మరి మహేష్…?

Published on Oct 22, 2019 7:18 am IST

మహేష్, బన్నీ సంక్రాంతి రేసులో ఉన్న సంగతి తెలిసిందే. వారు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరూ, అలవైకుంఠపురంలో ఒకే రోజు అనగా జనవరి 12న విడుదల కానున్నాయి. కాగా హిందువుల అతిపెద్ద పండుగలలో ఒకటైన దీపావళి ఇంకొద్ది రోజులలో రానుంది. పండగ సందర్భంగా ఫ్యాన్స్ కొరకు స్టార్ హీరోలు తమ చిత్రాలకు సంబంధించిన అప్డేట్ ఇవ్వడం సాధారణంగా జరుగుతుంది. బన్నీ దివాళి కానుకగా ‘రాములో రాములా… ‘సాంగ్ విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఆ సాంగ్ టీజర్ నేడు విడుదల కానుంది.

ఐతే మరి మహేష్ సంగతేంటి అనేది ఆసక్తికర ప్రశ్న. మహేష్ దీపావళి సందర్భంగా ఫ్యాన్స్ ని ఏవిధంగా అలరించనున్నారు అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహేష్ కూడా బన్నీ లా సాంగ్ ఏదైనా రిలీజ్ చేస్తాడా, లేక సడన్ సర్ప్రైజ్ లా టీజర్ అందిస్తారో చూడాలి. ఐతే ఏదో ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ మాత్రం ఉంటుందని సమాచారం. అనిల్ రావిపూడి తెరకెక్కుస్తున్న ఈ చిత్రంలో మహేష్ సరసన రష్మిక మందాన నటిస్తుండగా, విజయ శాంతి కీలక పాత్ర చేస్తున్నారు. ఈ మూవీ కి సంగీతం రాక్ స్టార్ దేవిశ్రీ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More