సాయి ధరమ్ కి కూడా మారుతి ఓ వీక్నెస్ అంటగడతాడా ?

Published on Jun 5, 2019 5:50 pm IST

మారుతి కామెడీ మరియు రొమాంటిక్ ఎంటెర్టైనర్లను చక్కగా తెరకెక్కిస్తాడని పేరుంది. దానితో పాటు ఈ మధ్య మారుతి తన హీరో లకు ఎదో ఒక జబ్బుతో కూడిన పాత్రను డిజైన్ చేస్తున్నాడు. “భలే భలే మగాడివోయ్” లో మతిపరుపు జబ్బుని నానికి అంటగట్టిన మారుతి,మహానుభావుడు మూవీలో శర్వానందుకు అతిశుభ్రం అనే వ్యాది తో కామెడీ పండించాడు. సిల్వర్ స్క్రీన్ పై ఈ ఫార్ములా ఫలితం ఇవ్వడంతో మారుతి ఈ పాయింట్ ని వదలడం లేదు.

మరి ప్రస్తుతం మారుతి సాయి ధరమ్ హీరోగా చేస్తున్న “భోగి” మూవీలో సాయి ధరమ్ కి ఏం వీక్నెస్ అంటగడతాడో అని జనాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతానికి ఇండస్ట్రీలో నడుస్తున్న టాక్ ప్రకారం తన అందం,చేష్టలతో అమ్మాయిలను వశపరుసుకునే మన్మధుడు లాంటి పాత్రను ధరమ్ కోసం రెడీ చేసారని . మరి ఇందులో అసలు నిజం తెలియాలంటే 2020 సంక్రాంతి వరకు ఆగవలసిందే.

సంబంధిత సమాచారం :

More