మెగాస్టార్ మరో మహత్తర కార్యానికి శ్రీకారం చుట్టనున్నారా.?

Published on Jun 9, 2021 1:00 pm IST

మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి ఆన్ స్క్రీన్ పైనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా హీరోనే అని రెండు దశాబ్దాల కాలం కితమే నిరూపించారు. మరి ఇప్పుడు ఈ కరోనా కష్ట కాలంలో గత ఏడాది సినీ కార్మికులను వేలాది మందికి అడ్డుకోవడమే కాకుండా ఈ ఏడాది రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు తన సొంత ఖర్చులు 36 కోట్లకు పైగా వ్యయంతో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకులను స్థాపించి మరింత మంది ప్రాణాలను కాపాడిన వారు అయ్యారు.

ఇదే కాకుండా మొన్ననే సినీ కార్మికులకు తన ట్రస్ట్ ద్వారా వ్యాక్సినేషన్ కూడా ఆరంభించారు. ఇన్ని చేస్తున్న మెగాస్టార్ మరో మహత్తర కార్యానికి పూనుకోనున్నారని టాక్ సోషల్ మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఇప్పటి వరకు ప్రాణవాయువు పంపిణి చేసిన మెగాస్టార్ మరికొన్ని రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల అంతటా చిరంజీవి అంబులెన్స్ సర్వీస్ లను కూడా మొదలు పెట్టనున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇది ప్రస్తుతానికి అధికారికం కాకపోయినా ప్రకటన రావొచ్చేమో అని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. మరి ఇది ఎంత వరకు నిజమో కాలమే నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం :