మరో సెన్సేషనల్ స్ట్రైట్ ప్రాజెక్ట్ లాక్ చేసిన మెగాస్టార్.?

Published on Oct 3, 2023 12:56 pm IST

మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన రీసెంట్ చిత్రం “భోళా శంకర్” ఘోర పరాభవాన్ని చూసిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుత కాలంలో రీమేక్స్ వర్కౌట్ అవ్వకపోతున్నప్పటికీ చిరు అయితే దీనిని మంచి సినిమా అందిస్తున్నామని దృక్పథంతోనే చేశారు. కానీ ఫైనల్ గా అనుకున్న రేంజ్ అవుట్ పుట్ అయితే రాలేదు.

ఇక ఈ చిత్రం తర్వాత మెగాస్టార్ కేవలం స్ట్రైట్ సినిమాలే ఒప్పుకోగా వరుసగా ఆల్రెడీ లాక్ చేసిన రెండు సినిమాలపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇవి కాకుండా మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్ కి మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి.

ఆ దర్శకుడు కూడా తన చిత్రాలతో మంచి సెన్సేషన్ ని రేపిన వాడే అని అంటున్నారు. అయితే ప్రస్తుతానికి అతని పేరు గోప్యంగానే ఉన్నా త్వరలో ఈ క్రేజీ కాంబినేషన్ పై అయితే క్లారిటీ రావచ్చని వినిపిస్తుంది. మరి దీనికోసం అయితే మరికాస్త సమయం ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :