మన టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ హీరోగా ఇప్పుడు పలు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాల్లో దర్శకులు సోము, నర్రి అనే కొత్త ద్వయం కలయికలో సితార బ్యానర్ లో అనౌన్స్ అయ్యిన ప్రాజెక్ట్ కూడా ఒకటి. జస్ట్ ఈ కొన్ని నెలల కితమే అనౌన్స్ చేసిన ఈ సినిమాలో మిరాయ్ బ్యూటీ రితికా నాయక్ ని నితిన్ సరసన హీరోయిన్ గా కూడా రివీల్ చేసారు.
కానీ లేటెస్ట్ రూమర్స్ ప్రకారం రితికా ఈ సినిమా నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. అయితే దీనికి కారణం ఏంటి అనేది ఇంకా రివీల్ కాలేదు. ఇక ఆమె ప్లేస్ లో మన తెలుగు బ్యూటీ ఒకామె ఆ లక్కీ చాన్స్ ని కొట్టేసినట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి. సో దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. మేకర్స్ ఈ సినిమాని ఒక బ్యూటిఫుల్ రోమ్ కామ్ ఎంటర్టైనర్ గా ప్లాన్ చేస్తుండగా త్వరలోనే కొత్త హీరోయిన్ తో మొదలు కానుంది.


