“మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” చిత్రం ఓటిటి బాట పట్టేనా?

Published on Jul 2, 2021 8:47 pm IST


తెలుగు సినీ పరిశ్రమ లో వరుస సినిమాలు వస్తూనే ఉన్నాయి. అయితే కరోనా వైరస్ కారణం గా థియేటర్లు మూత పడటం తో కొన్ని సినిమాలు ఆన్లైన్ వేదిక గా చిత్రాలను విడుదల చేస్తున్నాయి. అయితే ఇప్పటికే పలు చిత్రాలు తమ విడుదల తేదీలను ప్రకటించాయి. అయితే అదే వరుసలో మరొక చిత్రం ఉన్నట్లు తెలుస్తోంది. అదే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. అఖిల్ అక్కినేని హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం షూటింగ్ లాక్ డౌన్ కి ముందే పూర్తి అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం త్వరలో విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కి సంబందంచి ఈ చిత్రం ఓటిటి ద్వారా విడుదల అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం లో బన్నీ వాసు మరియు అల్లు అరవింద్ నిర్మాతలు గా గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రానికి సంగీతం గోపి సుందర్ అందిస్తున్నారు. అయితే ఈ చిత్రం విడుదల కి సంబందించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :