అదే నిజమైతే అలవైకుంఠపురంలో అతడే విలన్..!

Published on Dec 5, 2019 10:38 pm IST

టాలీవుడ్ లో తెరకెక్కే చాలా సినిమా కథలు, సన్నివేశాలు, ట్యూన్స్ కాపీ అంటూ ఆరోపణలు వస్తూవుంటాయి. ఐతే దానిని దర్శకులు స్ఫూర్తి అంటుంటే కొందరు కాపీ అంటూ సదరు దర్శకులను ఏకిపారేస్తున్నారు. ఇక టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరిగా ఉన్న త్రివిక్రమ్ పై ఈ ఆరోపణలు అనేక మార్లు వచ్చాయి. ముఖ్యంగా గత ఏడాది సంక్రాంతి కి విడుదలైన అజ్ఞాతవాసి మూవీ ఫ్రెంచ్ మూవీ లార్గో వించ్ కి రీమేక్ అని గట్టి ఆరోపణలు వచ్చాయి. అలాగే నితిన్ మూవీ అ ఆ.. విషయంలో కూడా మీనా చిత్రానికి కాపీ అనే ఆరోపణలు రావడం జరిగింది.

త్రివిక్రమ్ బన్నీ తో తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ అలవైకుంఠపురంలో పైన కూడా ఈ ఆరోపణలు ఆగడం లేదు. ఈ మూవీ కథకు ఎప్పుడో ఎన్టీఆర్ సావిత్రి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఇంటి గుట్టు’ చిత్రానికి చాలా పోలికలున్నాయని గట్టిగా వినిపిస్తుంది. మరి అదే కనుక నిజం ఐతే ఈ మూవీలో కీలక విలన్ మురళీశర్మ అయ్యే అవకాశం కలదు. కారణం ఏమిటంటే ‘ఇంటి గుట్టు’ సినిమాలో పేద తండ్రి తన కొడుకు ధనవంతుడిగా పెరగాలనే స్వార్ధంతో చంటి బిడ్డలను మార్చేస్తాడు. దీనితో ధనవంతుడైన హీరో పేదవాడిగా పెరుగుతాడు. కాబట్టి అలవైకుంఠపురంలో మురళీశర్మ సాఫ్ట్ విలన్ గా కనిపించే అవకాశం కలదు. మరి చూడాలి ఈ ఆరోపణల్లో ఎంత నిజం ఉందో.

సంబంధిత సమాచారం :

More