నాగశౌర్య ఆ క్లాసిక్ సినిమాని రీమేక్ చేస్తున్నాడా ?
Published on Jul 29, 2018 7:17 pm IST

యువ హీరో నాగ శౌర్య ప్రస్తుతం నూతన దర్శకుడు శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ‘@ నర్తనశాల’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఆగష్టు 31 న ప్రేక్షకులముందుకు తీసుకరావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇక ఈ చిత్రం తరువాత నాగశౌర్య ఒక క్లాసిక్ చిత్ర రీమేక్ లో నటించనున్నాడని సమాచారం. 1995లో ప్రముఖ దర్శకుడు ఈ వి వి సత్య నారాయణ దర్శకత్వంలో ఫ్యామిలీ హీరో జగపతి బాబు నటించిన ‘ఆయనకి ఇద్దరు’ చిత్రం అప్పట్లో ఒక క్లాసిక్ చిత్రం గా నిలిచిపోయింది. ఇప్పుడు తాజాగా నాగశౌర్య ఈ రీమేక్ లో నటించనున్నాడట. అయితే ఈ వార్తలపై అధికారిక సమాచారం వెలబడాల్సి ఉంది.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook