నాని ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దూరమవుతున్నాడా..?

నాని ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దూరమవుతున్నాడా..?

Published on Feb 25, 2025 7:00 PM IST

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ఆయన నటించిన ‘హిట్-3’ వేసవి కానుకగా గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తుండగా పూర్తి యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యింది.

ఈ సినిమా తర్వాత నాని తన నెక్స్ట్ చిత్రంగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘ది ప్యారడైజ్’లో నటించనున్నాడు. ఇక ఈ సినిమా కూడా పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీలో నాని తన పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే ఈ సినిమాలకు ముందు నాని నటించిన ‘సరిపోదా శనివారం’ కూడా యాక్షన్ డ్రామాగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

కాగా, నాని గతంలో వైవిధ్యమైన జోనర్‌లతో తన సినిమాలను తెరకెక్కించి ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దగ్గరయ్యాడు. కానీ, నాని చేస్తున్న ప్రస్తుత సినిమా లైనప్ చూస్తుంటే, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కాస్త దూరం అవుతున్నాడనే చెప్పాలి. ఆయన చేస్తున్న వరుస సినిమాలు యాక్షన్ ప్రాధాన్యత కలిగి ఉండటమే దీనికి కారణంగా పలువురు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు