నాచురల్ స్టార్ నాని హీరోగా కయాదు లోహర్ హీరోయిన్ గా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న అవైటెడ్ భారీ చిత్రమే ‘ది ప్యారడైజ్’. అనౌన్స్ చేసినప్పుడు నుంచే భారీ హైప్ ని చేసుకున్న ఈ సినిమా పరిస్థితి ఇపుడు చేజేతులా హైప్ ని తగ్గించుకునేలా మారుతుంది. దీనికి కారణం సినిమా షూట్ ఆలస్యం అవుతూ వస్తుండడం.
అనుకున్న సమయానికి సినిమా పూర్తి కాకపోవడం అనేది నాని ఫ్యాన్స్ కే ఒకింత ఆశ్చర్యంగా మారింది. ఈ సినిమా తప్పితే మరో సినిమాకి నాని సహా ఇతర ముఖ్య నటులు కానీ దర్శకుడు కానీ కమిట్ అయ్యి లేరు. అప్పటి నుంచీ సినిమా చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ ఇంకా దాదాపు రెండు నెలలకి పైగా షూట్ బ్యాలన్స్ ఉందని కొత్త రూమర్స్ వినిపిస్తున్నాయి.
దీనితో అప్పటి నుంచి షూట్ చేస్తున్నారంటే రెండు పార్టులుగా కానీ సినిమా చేస్తున్నారా ఈపాటికే ఎన్నో గంటల ఫుటేజ్ వచ్చి ఉండొచ్చు. పైగా గ్రాండ్ స్కేల్ లో చేస్తున్న సినిమా, డెఫినెట్ గా సీక్వెల్ స్కోప్ కూడా ఉండే అవకాశం లేకపోలేదు. మరి అసలు ఈ సినిమా విషయంలో ఏం జరుగుతుంది అనేది టీమే రివీల్ చేయాల్సి ఉంది. ఈ రిలీజ్ రూమర్స్ పై అయినా ఏమన్నా క్లారిటీ ఇస్తారో లేదో చూడాలి.


