మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన రీసెంట్ చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ కోసం అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత తన నుంచి “విశ్వంభర” అనే భారీ ఫాంటసీ డ్రామాతో ఈ జూలైలో పలకరించనున్నారు. అయితే చిరంజీవి కెరీర్లో ఫాంటసీ సబ్జెక్టులకి మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఈ లైనప్ లో మరో క్రేజీ కాంబినేషన్ లో కూడా యాడ్ అయినట్టు ఓ రూమర్ సినీ వర్గాల్లో వినిపిస్తుంది.
దీనితో యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ తో ఓ సినిమా ఉంది అంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. మరి ఇందులో ఏ మేరకి నిజం ఉంది అనేది చూస్తే ఈ టాక్ లో ఎలాంటి నిజం లేదట. ప్రస్తుతం నాగ్ అశ్విన్ దృష్టి అంతా కల్కి పార్ట్ 2 పూర్తి చేయడం మీదనే ఉందని తెలుస్తుంది. సో మెగాస్టార్ తో ఓ ఫాంటసీ సబ్జెక్టు అనే మాట నిజం కాదనే అనుకోవచ్చు. ఇక కల్కి షూట్ విషయానికి వస్తే ప్రస్తుతం ప్రభాస్ లేని కీలక సన్నివేశాలు మాత్రమే తెరకెక్కిస్తున్నారట.


