పవన్ ఆరోగ్యం పూర్తిగా కుదురుకుందా.?

Published on May 4, 2021 10:00 am IST

దేశంలో మళ్ళీ కరోనా కల్లోలం ఏ స్థాయిలో ఉందో చూస్తూనే ఉన్నాము. అలాగే ఇదే క్రమంలో మన టాలీవుడ్ కు చెందిన పలువురు స్టార్ హీరోలు కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. వారిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. తన సినిమా వకీల్ రిలీజ్ తర్వాత పవన్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అక్కడ నుంచి పవన్ ఆరోగ్యానికి సంబంధించి ఒకటి రెండు సార్లు మాత్రమే అధికారిక క్లారిటీ వచ్చింది.

అలాగే నెగిటివ్ కూడా వచ్చిందని తెలిసింది కానీ ఆరోగ్యం మాత్రం ఇంకా కుదురుకోలేదని సమాచారం వచ్చింది. కానీ లేటెస్ట్ సమాచారం ప్రకారం పవన్ పూర్తిగా కోవిడ్ నుంచి కోలుకున్నారాని ఆరోగ్యం అంతా కుదురుకుంది అని సినీ వర్గాల నుంచి సమాచారం. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక క్లారిటీ లేదు. దీనితో ఈ వార్త నిజం కావాలని అంతా అధికారిక ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. మరి ప్రస్తుతం పవన్ “హరిహర వీరమల్లు” మరియు అయ్యప్పణం కోషియం రీమేక్ సినిమాలో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :