ఇకపై పవన్ కళ్యాణ్ ఫుల్ టైం రాజకీయాలకే కేటాయిస్తాడా.?

ఇకపై పవన్ కళ్యాణ్ ఫుల్ టైం రాజకీయాలకే కేటాయిస్తాడా.?

Published on Mar 3, 2015 9:50 AM IST

Pawan-Kalyan
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మార్చి 5 నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మించనున్న ప్రాంతంలో పర్యటించనున్నారు. అక్కడ పర్యటించి రాజధాని నిర్మాణంలో భాగంగా ఆ ప్రాంతంలోని రైతుల మరియు మిగతా వారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోనున్నారు అనే విషయాలపై చర్చించనున్నారు.కొద్ది రోజుల క్రితమే పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా ఎలక్షన్స్ అప్పుడు చేసిన వాగ్దానాలను నెరవేర్చాలని బిజెపిని కోరాడు. అలాగే సెంట్రల్ బడ్జెట్ లో ఆంధ్ర ప్రదేశ్ కు తక్కువగా బడ్జెట్ కేటాయించడం పై కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో కలిసి చర్చలు జరిపాడు.

పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న ఈ స్టెప్స్ చూస్తుంటే ప్రజల్లో ఒక తెలియని ఆసక్తి రేగుతోంది. అదేమిటంటే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో ఫుల్ టైం పొలిటీషియన్ లా ప్రజల్లోకి రానున్నాడా.? లేక ఫిల్మ్ స్టార్ లానే మరి కొన్ని సంవత్సరాలు సినిమాలు చేస్తాడా.? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. మేము ప్రస్తుత పరిస్థులను బట్టి పవన్ తన ఫిల్మ్ కెరీర్ ని మరో రెండు మూడు సంవత్సరాలు కంటిన్యూ చేస్తాడనే అనుకుంటున్నాం.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్ 2’ ని సెట్స్ పైకి తీసుకెళ్ళే పనిలో ఉన్నాడు. అది కాకుండా దాసరి నారాయణరావు ప్రొడక్షన్ లో ‘సర్దార్’ సినిమాకి కమిట్ అయ్యాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు