“వకీల్ సాబ్”తో పవన్ మొట్టమొదటగా ఈ మార్క్ కి?

Published on Apr 18, 2021 9:00 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ కం బ్యాక్ చిత్రం “వకీల్ సాబ్”. కోవిడ్ లాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా పవన్ తన స్టార్డం కి తగ్గ వసూళ్లను రాబట్టేసాడు. అయితే అధికారికంగా ఇప్పటి వరకు ఈ సినిమా వసూళ్లపై ఎలాంటి ఫిగర్స్ రాలేదు కానీ ఇతర లెక్కలు అన్ని బాగానే బయటకు వస్తున్నాయి. మరి వాటి ప్రకారం మొదటి వారం వరకు పవన్ దుమ్ము లేపేసాడు.

రీమేక్ సబ్జెక్టు అయినప్పటికీ దర్శకుడు శ్రీరామ్ వేణు టేకింగ్ అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేసరికి ఉగాది వరకు పవన్ మాస్ చూపించాడు. ఇక అక్కడ నుంచి కాస్త డ్రాప్ అయినాయి పలు చోట్ల స్టాండర్డ్ గానే నిలిచాడు. మరి ఇలా పవన్ ఎట్టకేలకు వంద కోట్ల షేర్ మార్కెట్ లో అడుగు పెట్టాడని తెలుస్తుంది.

లాస్ట్ టైం బిగ్గెస్ట్ హిట్ “అత్తారింటికి దారేది” నుంచి పవన్ రేంజ్ హిట్ లేక వంద కోట్ల సినిమా అందని ద్రాక్ష గానే మిగిలింది. మరి అది వకీల్ సాబ్ తో తీరింది. అయితే దీనిపై మేకర్స్ కూడా ఓ అధికారిక పోస్టర్ లాంటిది విడుదల చేస్తే తప్ప పవన్ ఫ్యాన్స్ వరకు 100 కోట్ల సినిమా తప్పితే మిగతా ఎవరికీ కాకపోవచ్చు. మరి ఈ ఒక్క క్లారిటీ వస్తుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :