ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఇప్పుడు సెన్సేషనల్ లైనప్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇండియన్ సినిమా దగ్గర మోస్ట్ బిజీగా ఉన్న పాన్ ఇండియా హీరోస్ లో ఐకాన్ స్టార్ ఒకరిగా నిలవగా ఈ లైనప్ లో దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో ప్లాన్ చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ కూడా ఒకటి. అనౌన్సమెంట్ తోనే మంచి హైప్ ని జెనరేట్ చేసిన ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అయితే లేటెస్ట్ గా ఈ సినిమా హీరోయిన్ గా స్టార్ బ్యూటీ పూజా హెగ్డే లాక్ అయినట్టుగా కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇదే నిజం అయితే మాత్రం ‘అల వైకుంఠపురములో’ జోడీ రిపీట్ అయినట్టే అని చెప్పాలి. ఆల్రెడీ వీరికి ఇండస్ట్రీ హిట్ ట్రాక్ రికార్డు ఉంది. లోకేష్ కూడా పూజా హెగ్డేతో ‘కూలీ’లో మంచి ట్రీట్ ఇచ్చాడు. సో ఈ ముగ్గురు కలయికలో ప్రాజెక్ట్ అంటే మరింత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇక దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.


