పవర్ స్టార్ ఈ రేస్ లో లేడా..?

Published on Oct 10, 2020 9:00 am IST

ప్రస్తుతం పవర్ స్టార్ కళ్యాణ్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో “వకీల్ సాబ్” అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ చిత్రం “పింక్” కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం పవన్ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పైగా పవన్ కం బ్యాక్ చిత్రం కావడంతో భారీ స్థాయి అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే తక్కువ అప్డేట్సే వచ్చినా సరే అవి కూడా పవన్ ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకున్నాయి.

ఇటీవలే పవన్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన మోషన్ పోస్టర్ అయితే మరింత కిక్కిచ్చింది. అయితే ఇవన్నీ బాగున్నా అసలైన అప్డేట్ మాత్రం ఇప్పుడప్పుడే వచ్చే సూచనలు కనిపించడం లేదా అని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అదే ఈ చిత్రం టీజర్ కోసం. ఇప్పటికే చాలా చిత్రాలు టీజర్స్ తో రాయ్ అవుతున్నట్టుగా స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుంది.

ఈ దసరా రేస్ కు టాలీవుడ్ మరోసారి అదిరిపోయే అప్డేట్స్ తో కళాకలాడనుంది. ఆ కోలాహలం కోసం టాలీవుడ్ ఫ్యాన్స్ చాలా మందే ఎదురు చూస్తున్నారు. కానీ ఈ రేస్ లో వకీల్ సాబ్ టీజర్ నిలుస్తుందా లేదా అని టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే పవన్ ఈ రేస్ లో నివలడానికి అవకాశాలు అంతగా లేవనే టాక్. ఒకవేళ అనౌన్స్మెంట్ ఉన్నా కాస్త ముందు గానే తెలియజేసి అలెర్ట్ చేయనున్నారు. మొత్తానికి మాత్రం ఈ టీజర్ కోసం పవన్ ఫ్యాన్స్ చాలా ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :