ఈ పవర్ ఫుల్ కాంబో సెట్టయ్యిందా.?

Published on Aug 12, 2020 10:51 am IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు రెండు ఒకదాన్ని మించిన ఒకటి భారీ ప్రాజెక్టులు తెరకెక్కనున్నాయి. ఇవి ఇంకా లైన్ లో ఉండగానే ప్రభాస్ నటించబోయే తన 22 వ సినిమాకు సంబంధించి కూడా గత కొన్నాళ్ల నుంచి విపరీతమైన బజ్ వినిపిస్తుంది. ప్రభాస్ మరియు “కేజీయఫ్” దర్శకుడు ప్రశాంత్ నీల్ ల కాంబోలో ఈ చిత్రం ఉంటుంది అని రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ఇప్పుడు అందుకు అనుగుణంగానే ఈ కాంబోపై మరిన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి.

ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న బజ్ ప్రకారం ప్రభాస్ మరియు కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ యాక్షన్ థ్రిల్లర్ ను ప్లాన్ చేస్తున్నారట. అలాగే ఈ ప్రాజెక్ట్ ప్రభాస్ ముందు కమిట్ అయిన రెండు చిత్రాల అనంతరం అలాగే నీల్ మరియు తారక్ ల సినిమా పూర్తయ్యాక మొదలు కానుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇక అలాగే ఈ చిత్రం కూడా ఒక పవర్ ఫుల్ సబ్జెక్టు తోనే రానుంది అని టాక్. మరి నిజంగానే ఈ కాంబో సెట్టయ్యిందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :

More